Kathi Mahesh: అనూహ్యం... కత్తి మహేష్ కు మద్దతుగా పూనం కౌర్ ట్వీట్!

  • నిన్న కత్తి మహేష్ తల్లిని ప్రస్తావించిన ఓ టీవీ చానల్
  • ఇంటర్వ్యూ మధ్యలో వెళ్లిపోయిన కత్తి
  • ఆపై ఆయన తల్లిపై వెల్లువెత్తిన ట్వీట్లు
  • ఎవరైనా ఎవరి తల్లినీ కించపరచవద్దన్న పూనం కౌర్ 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు, నటి పూనం కౌర్ వ్యక్తిగత జీవితంపై సంచలన విమర్శలు చేస్తున్న కత్తి మహేష్ ను నిన్న ఓ టీవీ చానల్ లో ఇంటర్వ్యూ చేస్తూ, ఆమె తల్లిని గురించి ప్రశ్నించిన వేళ, కోపంతో కత్తి మహేష్ లేచి వెళ్లిపోయాడు. ఈ విషయంలో పూనం కౌర్ నుంచి కత్తికి అనూహ్య మద్దతు లభించింది.

ఎవరైనా ఓ వ్యక్తి తల్లిని కించపరుస్తూ మాట్లాడకూడదని వ్యాఖ్యానించింది. దయచేసి కత్తి మహేష్ తల్లిని గురించి మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. నిన్నటి టీవీ చానల్ ఇంటర్వ్యూ తరువాత కత్తి మహేష్ తల్లిపై ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తగా, పూనం కౌర్ హుందాగా స్పందించడం గమనార్హం.

More Telugu News