stock markets: స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది... తగ్గినప్పుడు ప్రవేశించచ్చని అంటున్న బ్రోకరేజీలు

  • నిఫ్టీ 11,500కు, సెన్సెక్స్ 37,000కు పెరుగుతాయి
  • తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాలను పరిశీలించొచ్చు
  • డ్యూచే, సీఎల్ఎస్ఏ సూచనలు

దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ ఇంకా ముగియలేదని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు డ్యూచే బ్యాంకు, సీఎల్ఎస్ఏ పేర్కొన్నాయి. స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలనుకునే వారు వేచి ఉండి మార్కెట్లు తగ్గిన సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచించాయి. నిఫ్టీ 11,400-11,500 వరకు, సెన్సెక్స్ 37,000 వరకు పెరుగుతాయని ఈ సంస్థలు అంచనా వేశాయి. 2017లో మన మార్కెట్లు 29 శాతం పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో ఉన్న నిధుల ప్రవాహం మన మార్కెట్ల ర్యాలీకి తోడ్పడింది.

అయితే 2018 మాత్రం భిన్నంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. రాబడుల అంచనాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే బలంగా ఉన్నాయని, చమురు ధరలు పెరిగితే మాత్రం కుదుపునకు లోనవ్వాల్సి వస్తుందని పేర్కొన్నాయి. నిఫ్టీ ఆదాయాలు 2018-19లో 22 శాతం మేర, 2019-20లో 17 శాతం మేర పెరుగుతాయన్న అంచనాలను డ్యూచే బ్యాంకు వ్యక్తీకరించింది.

More Telugu News