Pawan Kalyan: పదునైన ఆయుధం పట్టుకుని ఆవేశంగా దూసుకొస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. 'అజ్ఞాతవాసి' ట్రైల‌ర్ డిజైన్ చూడండి!

  • విడుదలకు సిద్ధమైన 'అజ్ఞాతవాసి' ట్రైలర్
  • వెయ్యికళ్లతో ఎదురు చూస్తోన్న అభిమానులు
  • 'అజ్ఞాతవాసి' ట్రైల‌ర్ డిజైన్ అదుర్స్

జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌రువాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వ‌స్తోన్న 'అజ్ఞాతవాసి' సినిమా కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌ల కాగా, ట్రైల‌ర్‌ కూడా విడుద‌లకు సిద్ధమైంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్రైల‌ర్ డేట్ డిజైన్ పేరిట ఆ సినిమా బృందం ఓ స్టిల్‌ను విడుద‌ల చేసింది.

ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దునైన ఆయుధం ప‌ట్టుకుని ఆవేశంగా దూసుకొస్తున్న‌ట్లు ఉంది. ఇక ట్రైల‌ర్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా న‌టించారు.  

More Telugu News