lalu prasad yadav: హైకోర్టుకి వెళతాం.. మా నాన్న‌కి బెయిల్ వ‌స్తుంది: లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారులు

  • న్యాయవ్యవస్థ త‌న ప‌ని తాను చేసింది
  • కోర్టు 'శిక్ష ఖ‌రారు తీర్పు'ని ప‌రిశీలిస్తాం
  • హైకోర్టుకు వెళ‌తాం
  • బెయిలు కోసం ద‌ర‌ఖాస్తు చేస్తాం

దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు ఈ రోజు శిక్ష ఖ‌రారైన విష‌యం తెలిసిందే. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స‌హా మ‌రో ఏడుగురికి మూడున్న‌రేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు.  లాలూ ప్రసాద్ యాద‌వ్ కుమారుడు, ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ ఈ విష‌యంపై స్పందించారు.

న్యాయవ్యవస్థ త‌న ప‌ని తాను చేసింద‌ని, కోర్టు శిక్ష ఖ‌రారు తీర్పుని ప‌రిశీలించిన త‌రువాత తాము హైకోర్టుకు వెళ‌తామ‌ని, బెయిలు కోసం ద‌ర‌ఖాస్తు చేస్తామ‌ని చెప్పారు. మరోవైపు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ త‌న తండ్రికి త‌ప్ప‌కుండా బెయిల్ వ‌స్తుంద‌ని అన్నారు. త‌మకు న్యాయ‌స్థానం మీద గౌర‌వం, న‌మ్మ‌కం ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.

More Telugu News