lalu prasad yadav: దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్ష ఖరారు!

  • 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసు 
  • లాలూకి జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా 
  • తీర్పు వెల్లడించిన రాంచీ సీబీఐ కోర్టు

దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు ఈ రోజు శిక్ష ఖ‌రారు అయింది. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స‌హా 15 మందిని రాంచీలోని సీబీఐ కోర్టు ఇటీవల దోషులుగా తేల్చిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచీ దోషులంద‌రూ జైలులో ఉన్నారు.

కాగా, జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్డి ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వీరికి శిక్ష‌ను ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు.

More Telugu News