ukraine: ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ బాలుడి ప్రాణాలు కూడా బ‌లిగొన్న వ్య‌క్తి!

  • భ‌వ‌నం మీద నుంచి దూకి బాలుడిపై ప‌డిన వైనం
  • బాలుడి తండ్రి క‌ళ్ల ముందే ఘోరం
  • ఉక్రెయిన్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌

తండ్రితో క‌లిసి 21 నెల‌ల వ‌య‌సున్న బాలుడు ఇంటి బ‌య‌ట ఆడుకుంటున్నాడు. ఈలోగా పైనుంచి ధ‌డేల్‌న ఓ వ్యక్తి బాలుడి మీద ప‌డ్డాడు. దీంతో ఆ బాలుడు, వ్య‌క్తి ఇద్ద‌రూ అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ఉక్రెయిన్‌కి చెందిన యెవ్‌జీని అనే వ్య‌క్తి ఆత్మ‌హత్య చేసుకోవ‌డానికి ఎనిమిదో అంత‌స్తు నుంచి దూకాడు. కానీ అదే స‌మ‌యంలో బాలుడు కింద ఉండ‌టంతో అత‌ని మీద ప‌డ్డాడు.

చ‌నిపోయిన వ్య‌క్తికి ఆ బాలుడు, అతని కుటుంబం కూడా తెలుసున‌ని, అదే అపార్ట్‌మెంట్లో నివ‌సించే వారు చెబుతున్నారు. ఏదో ప‌డిన శ‌బ్దం రాగానే అపార్ట్‌మెంట్లో అంద‌రూ బ‌య‌ట‌కి వ‌చ్చారు. బాబుని కాపాడ‌టానికి పారామెడిక‌ల్ సిబ్బంది తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. యెవ్‌జీని స‌రాస‌రి బాలుడి మీద పడ‌టంతో ఆ చిన్నారి నుజ్జునుజ్జ‌య్యాడ‌ని, దీంతో కాపాడ‌లేక‌పోయామ‌ని వారు తెలిపారు. బాలుడి త‌ల్లి ఆక్రంద‌న‌లు అక్క‌డ ఉన్న వారిని కంట‌త‌డి పెట్టించాయి.

More Telugu News