internet: ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్న తెలివైన శున‌కం వీడియో!

  • మంచు మీద స్లెడ్డింగ్ చేస్తున్న కుక్క‌
  • ఆ కుక్క పేరు సీక్రెట్‌
  • ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

చ‌లికాలం రాగానే కొన్ని దేశాల్లో మంచు విపరీతంగా కురుస్తుంటుంది. దాంతో ఖాళీ స‌మ‌యాల్లో ఆయా దేశాల ప్ర‌జ‌లు మంచు ప్రదేశాల్లో ఆట‌లు ఆడుతుంటారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన ఓ శున‌కం కూడా మంచులో ఆడుకోవాల‌నుకుంది. తోడుగా ఎవ‌రూ లేక‌పోవ‌డంతో దానంత‌ట అదే ఆడుకుంది. స్లెడ్డింగ్ ప్యాడ్ మీద ఎక్కి మంచు మీద జారుతూ ఎంజాయ్ చేసింది. ఇందులో విశేషం ఏంటంటే... ఆ కుక్కే స్వ‌యంగా స్లెడ్డింగ్ ప్యాడ్‌ను మోసుకుని పైకి తెచ్చుకోవ‌డం, దాన్ని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తూ కింది వ‌ర‌కు రావ‌డం భ‌లేగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఆ కుక్క పేరు సీక్రెట్‌. అది చేసే తెలివైన అల్ల‌రి ప‌నుల‌న్నింటినీ దాని య‌జ‌మాని మేరీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేస్తుంటుంది. మేరీ షేర్ చేసిన వాటిలో ఈ స్లెడ్డింగ్ వీడియో వైర‌ల్‌గా మారింది. డిసెంబ‌ర్ 29న ఈ వీడియో పోస్ట్ చేయ‌గా రెండు ల‌క్ష‌ల‌కు పైగా వీక్ష‌ణ‌లు, 50 వేల‌కు పైగా షేర్లు వ‌చ్చాయి.

More Telugu News