Donald Trump: హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్న 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్‌'

  • సేల్ ప్రారంభమైన గంట‌ల్లోనే స్టాక్ పూర్తి
  • అమెజాన్‌లో ట్రెండింగ్ నెం.1
  • ఆనందంలో ర‌చ‌యిత మైకేల్ వోల్ఫ్‌

శ్వేత‌సౌధంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కార్య‌క‌లాపాల గురించి లోతైన వివ‌ర‌ణ ఇస్తూ మైకేల్ వోల్ఫ్ రాసిన `ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్‌` పుస్త‌కాన్ని అమెరిక‌న్లు విప‌రీతంగా కొంటున్నారు. అర్థ‌రాత్రి విడుద‌లైన‌ప్ప‌టికీ ఈ పుస్త‌కాలు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి. సేల్ ప్రారంభ‌మైన గంట‌ల్లోనే పుస్త‌క విక్ర‌యశాల‌లు ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాకుండా ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గ‌జం అమెజాన్‌లో ఈ పుస్త‌కం ట్రెండింగ్ నెం.1గా నిలిచింది.
 
మ‌రోవైపు ఈ పుస్త‌కంలో ఉన్న‌వ‌న్నీ అబ‌ద్ధాలేనంటూ స్వ‌యంగా డొనాల్డ్ ట్రంప్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ర‌చ‌యిత మైకేల్ వోల్ఫ్ మీద చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేశాడు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య‌లే త‌న పుస్త‌క అమ్మ‌కాలపై ప్ర‌భావం చూపించాయ‌ని, అందుకు ట్రంప్‌కి కృతజ్ఞ‌త‌లు చెబుతున్నట్లు మైకేల్ వోల్ఫ్ ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News