lucky charms: అదృష్ట దేవ‌త‌లంతా ఒక్క చోటే.. క్రికెట్ ఆడుతున్న భ‌ర్త‌ల‌ను చీర్ చేసిన స‌తీమ‌ణులు!

  • స్టాండ్స్‌లో సంద‌డి చేసిన అనుష్క, రితిక, ఆయేషా
  • మొద‌టి టెస్టు మ్యాచ్‌కి హాజ‌రైన క్రికెట‌ర్ల స‌తీమ‌ణులు
  • వైర‌ల్ అవుతున్న ఫొటో

త‌మ భ‌ర్త‌లు క్రికెట్ ఆడుతుండ‌గా, చీర్ చేయ‌డానికి స్టేడియం స్టాండ్స్‌లో వారి స‌తీమ‌ణులంతా ఏక‌మ‌య్యారు. ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మ్యాచ్‌కి భార‌త జ‌ట్టు ఆట‌గాళ్ల స‌తీమ‌ణులు హాజ‌ర‌య్యారు. వీరిలో విరాట్ స‌తీమ‌ణి అనుష్క ప్ర‌త్యేకం. గ‌తంలో కూడా విరాట్ ఆడిన మ్యాచ్‌లు వీక్షించేందుకు అనుష్క హాజ‌రైంది. కానీ ఈ మ్యాచ్ ప్ర‌త్యేకం... వారి పెళ్లి త‌ర్వాత విరాట్ ఆడిన మొద‌టి మ్యాచ్ ఇది.

స్టేడియం స్టాండ్స్‌లో అనుష్క శ‌ర్మ ప‌క్క‌నే శిఖ‌ర్ ధావ‌న్ భార్య ఆయేషా, వారి ప‌క్క‌న కొద్ది దూరంలో రోహిత్ శ‌ర్మ భార్య రితికా సింగ్ కూర్చున్నారు. వీరంతా ఒక‌చోట కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అదృష్ట దేవ‌త‌లంతా ఒక్క చోటే కూర్చున్నారు.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News