rbi: కొత్త రూ.10 నోట్లను విడుద‌ల చేసిన‌ ఆర్బీఐ.. పాత రూ.10 నోట్లు కూడా చెల్లుబాటు!

  • చాకొలెట్ బ్రౌన్ కలర్‌లో కొత్త‌ నోట్లు
  • పాత నోట్ల పొడవు 137 మి.మీ.
  • కొత్త నోట్ల పొడ‌వు 123 మి.మీ
  • కొత్త నోటులో కుడివైపు కింద భాగంలో ‘10’ సంఖ్య

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఈ రోజు నూతన 10 రూపాయల నోట్లను విడుద‌ల చేసింది. చాకొలెట్ బ్రౌన్ కలర్‌లో ఈ నోట్లు ఉన్నాయి. ఈ కొత్త‌ నోట్ల వెడల్పు పాత నోట్లలాగే 63 మిల్లీ మీటర్లు ఉంది. కాగా, పాత నోట్ల పొడవు 137 మి.మీ. ఉండ‌గా, కొత్త నోట్ల పొడ‌వు మాత్రం 123 మి.మీ.గా ఉంది.

అలాగే, పాత నోటులో ‘10’ సంఖ్య మధ్యలో ఉండేది.. ఈ కొత్త నోటులో మాత్రం కుడివైపు కింద భాగంలో ముద్రించారు. గాంధీ బొమ్మ కొత్త నోటులో మధ్యలో ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం కిందే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుర్తు క‌న‌ప‌డుతోంది. కాగా, పాత పది నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ పేర్కొంది.    

More Telugu News