salil: ఇన్ఫోసిస్ కొత్త సీఈఓ స‌లీల్ ప‌రేఖ్‌కి భారీ మొత్తంలో జీతం!

  • సంవ‌త్స‌రానికి దాదాపు రూ. 34.45 కోట్లు
  • రూ. 6.5 కోట్ల‌ ఫిక్స్‌డ్ శాల‌రీ
  • వెల్ల‌డించిన కిర‌ణ్ మ‌జుందార్ షా

ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌లీల్ ప‌రేఖ్ వేత‌నం వివ‌రాల‌ను సంస్థ వెల్ల‌డించింది. ఆ వివ‌రాల ప్ర‌కారం సీఈఓ హోదాలో స‌లీల్ ప‌రేఖ్ సంవ‌త్స‌రానికి దాదాపు రూ. 34.45 కోట్లు జీతం రూపంలో అందుకోనున్నారు. ఇందులో రూ. 6.5 కోట్లు ఫిక్స్‌డ్ జీతం కాగా, రూ. 9.75 కోట్లు ప‌నితీరు ఆధారిత జీతం అంటే కంపెనీ ల‌క్ష్యాలు సాధించ‌క‌పోతే ఈ జీతం నుంచి త‌గ్గింపు ఉంటుందన్న‌మాట‌. అలాగే వార్షిక ఈక్విటీ గ్రాంట్ రూ. 3.25 కోట్లు, ప‌ర్ఫార్మెన్స్ ఈక్విటీ గ్రాంట్ రూ. 13 కోట్లు, ఏక‌స‌మ‌య ఈక్విటీ గ్రాంట్ రూ. 9.75 కోట్లుగా ఉన్న‌ట్లు బోర్డు మెంబ‌ర్ కిర‌ణ్ మ‌జుందార్ షా వెల్ల‌డించారు.

ఐఐటీ బాంబేలో ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్, కార్నెల్ యూనివ‌ర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసిన స‌లీల్ ప‌రేఖ్ గ‌తంలో క్యాప్‌జెమిని ఆసియా-ప‌సిఫిక్, ఉత్త‌ర అమెరికా, యూకే శాఖ‌కు హెడ్‌గా ప‌నిచేశారు. దాదాపు 14 సంవ‌త్స‌రాల‌పాటు క్యాప్‌జెమిని ఇండియాలో ప‌నిచేశారు. వివాదాస్ప‌ద ప‌రిస్థితుల మ‌ధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా చేయ‌గా, కొన్ని నెల‌ల పాటు జ‌ల్లెడ ప‌ట్టి కొత్త సీఈఓగా స‌లీల్‌ను ఎంపిక చేశారు.

More Telugu News