TTD: 2017లో వెంకన్న ఆదాయం రూ. 995.85 కోట్లు... కేవలం హుండీ ద్వారానే!

  • రూ. 995.85 కోట్ల హుండీ ఆదాయం
  • త్వరలో తిరుపతిలో 2,500 గదులు
  • స్వామిని దర్శించుకున్న 2.73 కోట్ల మంది
  • వెల్లడించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్

2017లో తిరుమల శ్రీనివాసునికి కేవలం భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 995.8 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెలాఖరు నాటికి క్యూ కాంప్లెక్స్‌ లో తోపులాటలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని పేర్కొన్నారు.

భక్తుల కోసం తిరుపతిలో 2500 గదులను నిర్మించనున్నామని ఆయన వెల్లడించారు. బ్రేక్ దర్శన టిక్కెట్ల ధరను పెంచాలన్న ఆలోచనపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, ప్రభుత్వానికి కూడా ఎలాంటి నివేదికనూ పంపలేదని తెలిపారు. గత సంవత్సరం మొత్తం 2,73,13,897 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 10,66,72,730 లడ్డూలను పంపిణీ చేశామని తెలిపారు.

More Telugu News