Tirumala: తిరుమలకు మరింత పటిష్ట భద్రత కల్పిస్తాం: టీటీడీ సీవీఎస్ వో

  • మొత్తం 1400 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత
  • సోమవారం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు పనులు  
  • స్మోక్ డిటెక్టర్, ఫేస్ రికగ్నిషన్, క్రౌడ్ కంట్రోల్ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న అధికారి

తిరుమలకు మరింత పటిష్ట భద్రత కల్పిస్తామని టీటీడీ సీవీఎస్ వో రవికృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో మొత్తం 1400 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత కల్పిస్తామని, ఇందుకోసం ఎన్ఎస్ఐసి(నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్) సహకారం తీసుకుంటున్నామని అన్నారు. తొలి దశలో హై సెక్యూరిటీ జోన్ లోని శ్రీవారి ఆలయం, పరకామణి, మాడ వీధుల్లో 175 ఫిక్స్ డ్ కెమెరాలు, 87 పీటీజే కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

 అగ్ని ప్రమాదాలను గుర్తించే స్మోక్ డిటెక్టర్, అసాంఘిక శక్తులను గుర్తించే నిమిత్తం ఫేస్ రికగ్నిషన్, భక్తుల రద్దీని తెలుసుకునేందుకు క్రౌడ్ కంట్రోల్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, సోమవారం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నట్టు చెప్పారు. తిరుమలలో భద్రతను కామన్ కమాండ్ కంట్రోల్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.

More Telugu News