Japan: ఉత్త‌ర‌ కొరియా త‌న తీరు మార్చుకుంటే మంచిది!: జ‌పాన్ అధ్యక్షుడు

  • కిమ్ జాంగ్ ఉన్ త‌మ దేశ‌ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలి
  • ఉత్తర కొరియాపై ఇప్ప‌టికే ఆంక్ష‌లు ఉన్నాయి
  • ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందనే అంశాన్ని ప‌రిశీలిస్తున్నాం
  • తీరు మార్చుకుంటే ఉ.కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుంది

ఎవ‌రి మాటా విన‌కుండా క్షిప‌ణి ప‌రీక్ష‌లు చేస్తూ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న ఉత్తర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై జపాన్‌ అధ్యక్షుడు షింజో అబే మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉత్తర కొరియా తన వైఖ‌రిని మార్చుకునేందుకు, అణు కార్యక్రమాలకు ముగింపు పలికేందుకు దక్షిణ కొరియా, అమెరికాలతో కలిసి త‌మ దేశం ఏమేం చేయాలో అవ‌న్నీ చేసిందని అన్నారు.

 కిమ్ జాంగ్ ఉన్ తన విధానాలను మార్చుకొని త‌మ దేశ‌ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల‌ని ఆయ‌న సూచించారు. ఉత్తర కొరియాపై ఇప్ప‌టికే ఆంక్ష‌లు ఉన్నాయ‌ని, ఆ ప్రభావం ఎంత మేరకు పడుతుందనే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్ ఇక‌నైనా త‌న తీరును మార్చుకుంటే ఉత్తర కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుంద‌ని అన్నారు. 

More Telugu News