North Korea: గ‌త ఏడాది బాలిస్టిక్‌ క్షిపణిని ప‌రీక్షించిన ఉ.కొరియా.. వాళ్ల ప్రాంతంలోనే ప‌డ్డ వైనం!

  • వివ‌రాలు వెల్ల‌డించిన అమెరికా అధికారి
  • టోక్చోన్‌ అనే నగరం మీదుగా వెళ్లిన క్షిప‌ణి
  • వ్యవసాయ క్షేత్రాలు, భవనాలు పాడైన వైనం

క‌య్యాలమారి ఉత్త‌ర‌కొరియా చేస్తోన్న క్షిప‌ణి పరీక్ష‌లు ప్ర‌పంచ దేశాల‌కు ముప్పుగా మారుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. అమెరికా, ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌లాంటి దేశాలు ఎంతగా ఉత్త‌ర‌కొరియాను హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ ఆ ప్ర‌య‌త్నాలు వృథా అవుతున్నాయి.

కాగా, ఉత్త‌ర కొరియా గ‌త ఏడాది ఏప్రిల్‌లో ఓ క్షిప‌ణి ప‌రీక్ష‌ చేయ‌గా అది వాళ్ల దేశంలోని ఓ ప్రాంతంలో ప‌డింద‌ని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. హ్వాసాంగ్‌-12 అనే బాలిస్టిక్‌ క్షిపణి సాంకేతిక లోపం కారణంగా టోక్చోన్‌ అనే నగరం మీదుగా వెళ్లిందని అన్నారు. దీంతో ఆ నగరంలోని వ్యవసాయ క్షేత్రాలు పాడవగా, భవనాలు కూలిపోయాయ‌ని అన్నారు. రెండు లక్ష‌ల జ‌నాభా ఉన్న‌ టోక్చోన్‌లోని ప్ర‌జ‌లకు మాత్రం ప్రాణ హాని జరగలేదని అన్నారు. 

More Telugu News