Hyderabad: జూబ్లీ హిల్స్ లో నడిరోడ్డుపై బైకర్ ను అడ్డగించి.. దోపిడీ!

  • అంద‌రూ చూస్తుండ‌గానే దారిదోపిడీ
  • క‌త్తితో బెదిరించి బైకు, ప‌ర్సు, రెండు సెల్‌ఫోన్ల‌ను కాజేసిన దుండ‌గులు
  • సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల ద‌ర్యాప్తు

హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ట్ట‌ప‌గ‌లే అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై దోపిడీ జ‌రగడం కల‌క‌లం రేపుతోంది. ముగ్గురు దుండగులు ఓ వ్య‌క్తిని బెదిరించి ద్విచ‌క్ర వాహ‌నం, ప‌ర్సు, రెండు సెల్‌ఫోన్ల‌ను కొట్టేసి పారిపోయారు. బాధితుడు ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది.

దుండ‌గులు క‌త్తితో బెదిరిస్తూ ఈ దోపిడీకి పాల్ప‌డ్డారు. రోడ్డుపై వెళుతోన్న ఇత‌ర వాహ‌న‌దారులు చూస్తూ నిల‌బ‌డ్డారే కానీ, ఎవ్వ‌రూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.      

More Telugu News