jayam ravi: ఆసక్తిని రేకెత్తించే కంటెంట్ తో ' టిక్ .. టిక్ .. టిక్'

  • సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా 'టిక్ .. టిక్ .. టిక్'
  • తాజాగా ఆడియో విడుదల 
  • ఈ నెల 26వ తేదీన తమిళంలో రిలీజ్
  • తెలుగులోను ఇదే టైటిల్ తో

కోలీవుడ్ స్టార్ హీరోలలో 'జయం రవి' ఒకరుగా కనిపిస్తాడు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ .. తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తమిళంలో 'టిక్ .. టిక్ .. టిక్' అనే సినిమా చేశాడు. 'అంతరిక్షం' నేపథ్యంలో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దర్శకుడు సౌందరరాజన్ తెరకెక్కించాడు.

తాజాగా చెన్నైలో ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేశారు. డి.ఇమాన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో, నివేదా పెతురాజ్ కథానాయికగా నటించింది. తమిళంలో ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగులోను ఇదే పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతో తనకి మరో హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో జయం రవి వున్నాడు. 

More Telugu News