new year: న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా వాట్సాప్‌లో 75 బిలియ‌న్ల మెసేజ్‌లు

  • వాటిలో 13 బిలియ‌న్లు ఫొటోలు
  • 5 బిలియ‌న్ల వీడియోలు
  • వెల్ల‌డించిన వాట్సాప్‌

న్యూఇయ‌ర్ రాత్రి మెసేజ్‌ల తాకిడి త‌ట్టుకోలేక వాట్సాప్ ఓ గంట‌సేపు మొరాయించిన సంగ‌తి తెలిసిందే. కానీ మెసేజ్‌ల విష‌యంలో మాత్రం రికార్డు సృష్టించింది. వాట్సాప్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా 75 బిలియ‌న్ల మెసేజ్‌లు వెళ్లాయ‌ట‌. వీటిలో 13 బిలియ‌న్ల ఫొటోలు, 5 బిలియ‌న్ల వీడియోలు ఉన్న‌ట్లు తెలిపింది. ప‌సిఫిక్ స్టాండ‌ర్డ్ టైమ్ ప్ర‌కారం డిసెంబ‌ర్ 31, ఉద‌యం 12 గం.ల నుంచి రాత్రి 11:59 మ‌ధ్య పంపిన మెసేజ్‌లను వాట్సాప్ లెక్కించింది.

వీటిలో భార‌తదేశం నుంచి వెళ్లిన మెసేజ్ లు 20 బిలియన్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. భార‌త మార్కెట్‌లో 200 మిలియ‌న్ల కంటే ఎక్కువ మంది స‌గ‌టు నెల‌వారీ వినియోగ‌దారులు ఉన్నారు. వాట్సాప్ చ‌రిత్రలో అతి ఎక్కువ మెసేజ్‌లు వెళ్లిన రోజుగా ఈ డిసెంబ‌ర్ 31 రికార్డు సృష్టించిందని సంస్థ పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్లు ప్ర‌వేశ‌పెడుతూ వినియోగ‌దారుల ఫేవ‌రెట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలుస్తోంది.

More Telugu News