akkineni internationalk foundation: అక్కినేని కుటుంబానికి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

  • ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ కోల్పోయిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్
  • ఆదాయ వివరాలను అందించని ఫౌండేషన్
  • కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు

అక్కినేని ఫ్యామిలీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్'కు చెందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఆదాయపు వివరాలు ఇవ్వని పలు ఎన్జీవోల గుర్తింపును రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో ప్రకటించారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు ఎన్జీవోలు ఉన్నాయి.

తెలంగాణకు చెందిన 190, ఏపీకి చెందిన 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ లిస్టులో అక్కినేని ఫౌండేషన్ కూడా ఉంది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, వివరాలను సమర్పించని సంస్థలపై తాజాగా కేంద్రం వేటు వేసింది. ఎఫ్సీఆర్ఏ లేని ఎన్జీవోలు విదేశాల నుంచి విరాళాలను పొందలేవు.

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ను 2005లో అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పలువురు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తున్నారు. వీటితో పాటు పలు సేవా కార్యక్రమాలు, కుటుంబ వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది.

More Telugu News