Pakistan: ఉగ్రవాదులపై ధోరణి మార్చుకున్న పాక్... నటనా? నిజమా?

  • అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి
  • నిధులను ఆపేస్తామని హెచ్చరించిన ట్రంప్
  • ఉగ్ర సంస్థల ఆస్తుల సీజ్ కు కదిలిన ప్రభుత్వం
  • ఏ ఆస్తులను సీజ్ చేశామన్నది మాత్రం చెప్పని పాలకులు

అమెరికా హెచ్చరికల ఫలితమో లేక వివిధ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడో లేక స్వదేశీ ప్రజలకు పాలకులపై విశ్వాసాన్ని పెంచాలన్న ఆలోచనో తెలియదుగానీ, పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులు, వారి సంస్థలపై చర్యలు ప్రారంభించినట్టు కనిపిస్తోంది. పాకిస్థాన్ లో వాస్తవ పరిస్థితి ఏంటో తెలియదుగానీ, హఫీజ్ సయీద్ నిర్వహించిన జమాతే ఉద్ దవాతో పాటు లష్కరే తోయిబా వంటి సంస్థల ఆస్తులను సీజ్ చేసే పనులను మొదలు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

ఉగ్రవాదాన్ని ఆపాల్సిందేనని, అప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఆ దేశానికి ఇచ్చేది లేదని, 48 గంటల్లోగా చర్యలు ప్రారంభించాలని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పాక్ పై పెను ప్రభావాన్నే చూపాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. అమెరికా హెచ్చరికలతో తమ ధోరణిని మార్చుకున్నట్టు ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచనలో పడ్డ పాక్, ఇప్పటికే హఫీజ్ సయీద్ సొంత ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దవా, ఇకపై ఎటువంటి విరాళాలనూ స్వీకరించరాదని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు, ఆ సంస్థ ఆస్తులను ప్రస్తుతం సీజ్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఏఏ ఆస్తులను సీజ్ చేశామన్న విషయాన్ని మాత్రం ఇంకా పాక్ వెల్లడించక పోవడం గమనార్హం.

More Telugu News