Andhra Pradesh: గజల్ శ్రీనివాస్ అలాంటి వాడు కాదు.. అతనిపై కుట్ర జరిగిందనుకుంటున్నాను!: ఏపీ మంత్రి మాణిక్యాలరావు

  • చిన్నప్పటి నుంచి అతను నాకు తెలుసు
  • అతనిపై కావాలనే కుట్ర చేశారని భావిస్తున్నా
  • పథకం ప్రకారం చేయకపోతే ఆ వీడియోలు బయటకు ఎలా వస్తాయి?
  • మీతో నేను వాదించదలచుకోలేదు: మీడియాతో మాణిక్యాలరావు

ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు చిన్నప్పటి నుంచి గజల్ శ్రీనివాస్ బాగా తెలుసని, అతను అలాంటివాడు కాదని అన్నారు. అతను ఏ తప్పూ చేయలేదని అనుకుంటున్నానని, అతనిపై కావాలనే కుట్ర చేశారని భావిస్తున్నానని అన్నారు. పథకం ప్రకారం చేయకుంటే వీడియోలు బయటకు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మీడియా లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, ‘మీతో నేను వాదించదలచుకోలేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. ఏదైనా డిస్కషన్ ఉంటే బయట మాట్లాడతాను. మీకంటే గట్టిగా నేనూ మాట్లాడగలను. మీడియా ముందు మాట్లాడుతున్నాను కనుక, సంప్రదాయకమైన భాషలో మీతో మాట్లాడాలి.. ఈ మైకు ఆన్ లో ఉండగా చక్కగా మాట్లాడతా, అంతకుమించి వద్దు’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News