Harish Rao: ఏపీ మంత్రి దేవినేనితో ఫోన్‌లో చ‌ర్చించి.. ఆర్డీఎస్ రైతులకు శుభవార్త చెప్పిన హ‌రీశ్‌రావు!

  • నీటిని విడుదల చేయాలని చాలా రోజులుగా ఆర్డీఎస్ పరిధిలోని రైతుల డిమాండ్‌
  • ఉమ్మడి ఇండెంట్ పంపించడానికి ఏపీ అంగీకారం
  • ఒకటి, రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు
  • మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్డీఎస్‌ ఆయకట్టు 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావుతో తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి హ‌రీశ్ రావు ఫోన్‌లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం తెలంగాణ నీటి పారుద‌ల శాఖ నుంచి
ఆర్డీఎస్ రైతులకు శుభవార్త అందింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల కానుంది. ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు తుంగభద్ర నుంచి నీటి విడుదలపై ఇరువురు మంత్రులు చర్చించారు.

నీటి విడుదలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ ఇవ్వ‌గా ఏపీ ఇవ్వవలసి ఉంది. ఉమ్మడిగా ఇండెంట్ ఇస్తే ఇటు ఆర్డీఎస్‌కు, అటు సుంకేసులకు నీరు చేరుతుంది. తుంగభద్ర నుంచి ఏపీకి 5.2 టి.ఎం.సి.లు, తెలంగాణకు 3.5 టి.ఎం.సి.ల నీటి వాటా రావాల్సి ఉంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని చాలా రోజులుగా ఆర్డీఎస్ పరిధిలోని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఇండెంట్ పంపించడానికి ఏపీ ఈ రోజు అంగీకరించింది. దీంతో ఒకటి, రెండు రోజుల్లో తుంగభద్ర నుంచి ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగు నీరందుతుంది. 

More Telugu News