aap: రాజ్యసభకు 'ఆప్' అభ్యర్థుల ఎంపిక.. కుమార్ విశ్వాస్ కు మొండిచేయి!

  • రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
  • కుమార్ విశ్వాస్ కు దక్కని అవకాశం
  • 16న ఎన్నికలు

తర్జనభర్జనల అనంతరం రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించింది ఆప్. మూడు అభ్యర్థిత్వాలకు గాను సుశీల్ గుప్తా, నవీన్ గుప్తా, సంజయ్ సింగ్ ల పేర్లను ఖరారు చేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సుశీల్ గుప్తా ఢిల్లీలో పేరున్న వ్యాపారవేత్త. ఆయనకు ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నాయి. నెల క్రితం వరకు కాంగ్రెస్ లో ఉన్న ఆయన ఆప్ లో చేరారు. ఇక నవీన్ గుప్తా పేరున్న చార్టెడ్ అకౌంటెంట్. ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాకు ఆయన ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు, పార్టీ తీసుకున్న నిర్ణయంతో కుమార్ విశ్వాస్ అసహనానికి గురయ్యారు. రాజ్యసభకు వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజ్రీవాల్ తో పెరిగిపోయిన విభేదాల కారణంగా విశ్వాస్ కు రాజ్యసభ సీటు దక్కలేదు. ఈ మూడు సీట్ల కోసం జనవరి 16న ఎన్నికలు జరగనున్నాయి.

More Telugu News