surya: 'గ్యాంగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం!

  • సూర్య హీరోగా తెలుగులో 'గ్యాంగ్'
  • ఈ నెల 5వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈ నెల 12వ తేదీన భారీస్థాయి రిలీజ్

సూర్య హీరోగా తమిళంలో 'తానా సెరిందా కూట్టమ్' తెరకెక్కింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన తమిళంలో విడుదలవుతోంది. అదే రోజున 'గ్యాంగ్' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత చేరువ చేయడం కోసం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

 ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ .. జె.ఆర్.సి.కన్వెన్షన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో సూర్యకు .. కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో వున్నారు. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి మరి.   

More Telugu News