mohan babu: మూడు షిఫ్ట్‌లూ వాడితోనే గడుపుతున్నాను: మోహన్‌ బాబు హర్షం

  • నా బిడ్డలు పుట్టినప్పుడు బిజీగా ఉండేవాడిని
  • మూడు షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ వారికి సమయం కేటాయించలేదు
  • ఇప్పుడు నా మనవడు పుట్టగానే మూడు షిఫ్ట్ లూ వాడితోనే

సినీనటుడు మంచు విష్ణు మ‌రోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయ‌న భార్య విరోనికా ఇటీవలే పండంటి బాబుకి జన్మనివ్వడంతో మంచు వారి కుటుంబం ఆ బాబుతో సందడిగా గడుపుతోంది. తాజాగా మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు చేసిన ఓ ట్వీట్ అలరిస్తోంది.

'నా బిడ్డలు పుట్టినప్పుడు... 3 షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్ లూ వాడితోనే గడుపుతున్నాను' అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికాలకి ఇద్దరు కవల ఆడపిల్లలు ఉండగా ఇప్పుడు మూడో బిడ్డగా బాబు జన్మించాడు. 

More Telugu News