flipkart: కొత్త కంపెనీ పెడుతున్న ఫ్లిప్‌కార్ట్ వ్య‌వ‌స్థాప‌కులు స‌చిన్ బ‌న్సాల్‌, బిన్నీ బ‌న్సాల్‌

  • కంపెనీ పేరు 'స‌బిన్ అడ్వైజ‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌'
  • త‌మ‌ పెట్టుబ‌డులు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ఈ కంపెనీ
  • స‌బిన్ అంటే స‌చిన్‌లో 'స‌', బిన్నీలో 'బిన్‌'

ఫ్లిప్‌కార్ట్ కంపెనీ లాభాల బాట‌లో దూసుకుపోతుండ‌టంతో వ్య‌వ‌స్థాప‌కులు స‌చిన్ బ‌న్సాల్‌, బిన్నీ బ‌న్సాల్‌లు వివిధ సంస్థ‌ల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే వీరి పెట్టుబ‌డుల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ప్రత్యేకంగా మ‌రో కొత్త సంస్థ‌ను పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. 'స‌బిన్ అడ్వైజ‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌' పేరుతో ఓ కొత్త కంపెనీ వీరిద్ద‌రూ డిసెంబ‌ర్ 8న రిజిస్ట‌ర్ చేయించారు. అయితే ఈ కంపెనీ ఏర్పాటు చేయ‌నున్న ఉద్దేశం గురించి అధికారికంగా ఎలాంటి స‌మాచారాన్ని వారు ప్ర‌క‌టించ‌లేదు.

స‌చిన్‌లో 'స‌', బిన్నీలో 'బిన్‌'ల‌ను క‌లిపి స‌బిన్ అని పేరు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే సచిన్ బ‌న్సాల్ 7 సంస్థ‌ల్లో 26 మిలియ‌న్ డాల‌ర్లు, బిన్నీ బ‌న్సాల్ 17 సంస్థ‌ల్లో 32 మిలియ‌న్ డాల‌ర్లు వ్య‌క్తిగ‌తంగా పెట్టుబడులు పెట్టారు. దాదాపుగా వీరి పెట్టుబ‌డుల‌న్నీ స్టార్ట‌ప్ కంపెనీల్లోనే ఉన్నాయి. గ‌తేడాది 'బిలియ‌న్' అనే ఒక ప్ర‌త్యేక మొబైల్ ఫోన్ బ్రాండ్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. వారు ఎన్ని సంస్థ‌ల్లో పెట్టుబడులు పెట్టిన‌ప్ప‌టికీ ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను వారు ప్రత్యేకంగా ఉంచారు. స్మార్ట్‌బై, ప‌ర్‌ఫెక్ట్ హోమ్స్‌, మార్కి, అన్అకాడ‌మీ వంటి సంస్థ‌ల్లో బ‌న్సాల్ సోద‌రులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు.

More Telugu News