pavan: ఒక రోజు ముందుగానే రానున్న 'అజ్ఞాతవాసి' ట్రైలర్?

  • 'అజ్ఞాతవాసి' పట్ల అందరిలో ఆసక్తి 
  • రేపు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ అంటూ టాక్ 
  • ఈ నెల 10వ తేదీన సినిమా విడుదల  

పవన్ అభిమానులంతా 'అజ్ఞాతవాసి' సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను, ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మరింతగా అంచనాలను పెంచాలనే ఉద్దేశంతో, ఈ నెల 5వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

అయితే ఒక రోజు ముందుగానే ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారనేది తాజా సమాచారం. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడవలసి వుంది. ఇప్పటికే టీజర్ కి .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమనే నమ్మకంతో ఫ్యాన్స్ వున్నారు. 

More Telugu News