Piyush Goyal: ఇక ఏ రైలుకైనా 22 బోగీలు మాత్రమే!

  • ప్రస్తుతం డిమాండ్ ను బట్టి 12 నుంచి 26 బోగీలు
  • ఒక రైలు స్థానంలో మరో రైలును నడిపించేందుకు ఇబ్బంది
  • అన్ని రైళ్లలోనూ 22 బోగీలనే ఉంచాలని నిర్ణయం
  • వెల్లడించిన రైల్వే మంత్రి పీయుష్ గోయల్

ఇప్పటివరకూ రైలు ప్రయాణించే మార్గాన్ని, ఆ మార్గంలో డిమాండును బట్టి 12 నుంచి 26 బోగీలను ఏర్పాటు చేస్తుండగా, ఇకపై అన్ని రైళ్లలోనూ 22 బోగీలను మాత్రమే ఏర్పాటు చేయనున్నామని ఇండియన్ రైల్వేస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్వయంగా వెల్లడించారు. ఒక్కో రైలులో బోగీల సంఖ్య రకరకాలుగా ఉండటంతో, ఒక రైలు స్థానంలో మరో రైలును నడిపించేందుకు ఇబ్బందిగా ఉందని, ఒక రైలు ఆలస్యం అయ్యే పరిస్థితుల్లో మరో రైలును వేయలేకపోతున్నామని చెప్పిన ఆయన, ఇకపై అన్ని రైళ్లకూ 22 బోగీల చొప్పున ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొలి దశలో 300 రైళ్లను గుర్తించామని, ఈ రైళ్లలో బోగీల సంఖ్య ఒకేలా ఉండేలా చేస్తామని అన్నారు. ఇక పలు రైల్వే స్టేషన్లలో వీటిని నిలిపేందుకు ప్లాట్ ఫాంల పొడవును పెంచనున్నామని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News