china: ట్రంప్ దెబ్బకు పాక్ విలవిల.. మద్దతుగా నిలిచిన చైనా

  • పాక్ కు ఆర్థికసాయం ఆపేసిన అమెరికా
  • పాక్ మంచి దేశమన్న చైనా
  • తీవ్రవాదంపై పోరాటం చేస్తోందని కితాబు

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారంటూ పాకిస్థాన్ పై ఘాటైన పదజాలంతో అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తమ నుంచి భారీ సాయం అందుకుంటున్న పాక్... తిరిగి అమెరికాకు చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. ఇప్పటిదాకా పాక్ కు మూర్ఖంగా ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ట్రంప్ ట్వీట్ తో పాక్ కు ఇవ్వాల్సిన రూ. 1600 కోట్ల సాయాన్ని అమెరికా నిలిపి వేసింది. దీంతో, పాక్ విలవిల్లాడుతోంది. పరిస్థితిని పూర్వ స్థితికి తెచ్చేందుకు పాక్ ప్రధాని అబ్బాసీ చర్చోప చర్చలు జరుపుతున్నారు.

ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోని సంస్థలు నిధులు సేకరించరాదని పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, పాక్ మిత్ర దేశం చైనా ఎప్పట్లానే తన ఒంటెద్దు పోకడలను ప్రదర్శించింది. పాకిస్థాన్ చాలా మంచి దేశమని... ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసిందని ప్రశంసించింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తోందని కితాబిచ్చింది. 

More Telugu News