priyanka chopra: ప్రియాంక చోప్రా సినిమాలో ఆలియాభ‌ట్‌?

  • పిల్ల‌లు, వీధికుక్క‌ల గురించి సినిమా
  • అంగీక‌రించని ఇత‌ర హీరోయిన్లు
  • ఆలియాభ‌ట్‌ను క‌లిసిన ప్రియాంక‌

అంత‌ర్జాతీయ న‌టిగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా, బాలీవుడ్‌లో పెద్ద‌గా సినిమాల్లో న‌టించ‌డం లేదు. అయినప్ప‌టికీ కొన్ని సినిమాల‌ను నిర్మించాల‌ని యోచిస్తోంది. అందులో భాగంగానే భార‌త్ విచ్చేసిన ప్ర‌తిసారీ త‌న సినిమాల్లో న‌టించే హీరోయిన్ల కోసం వెతుకుతోంది. ఈ నేప‌థ్యంలో తాను పిల్ల‌లు, వీధికుక్క‌ల క‌థాంశంతో నిర్మించ‌బోయే సినిమాలో న‌టించాల‌ని చాలా మంది హీరోయిన్ల‌ను అడిగింద‌ట‌. అయితే వారంతా ప్రియాంక‌కి నో చెప్పేశార‌ట‌.  

ఈ నేపథ్యంలో ఇటీవ‌ల భార‌త్ వ‌చ్చిన‌పుడు ఇదే క‌థ‌ను ఆలియాభ‌ట్‌కి వివ‌రించి, ఆ చిత్రంలో న‌టించాల‌ని ప్రియాంక ఆమెను కోరింద‌ట‌. స్వ‌త‌హాగా జంతువులంటే అమిత‌మైన ప్రేమ చూపించే ఆలియాభ‌ట్ ఈ చిత్రంలో న‌టించేందుకు ఆసక్తి చూపిన‌ట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి ప్రియాంక గానీ, ఆలియా గానీ అధికారికంగా ఎలాంటి విష‌యాన్ని వెల్ల‌డించలేదు.

More Telugu News