pavan: 'కొడకా కోటేశ్వర్రావా' పాటలో కనిపించనున్న అనిరుథ్!

  • 'అజ్ఞాతవాసి' ఆడియోకి మంచి రెస్పాన్స్ 
  • అనిరుథ్ కి పెరుగుతోన్న క్రేజ్ 
  • వరుసగా వస్తోన్న అవకాశాలు  

తమిళంలోని యువ సంగీత దర్శకులలో ఇప్పుడు అనిరుథ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తమ సినిమాలకి ఆయనే పనిచేయాలని స్టార్ హీరోలు అంటున్నారు. అలాంటి అనిరుథ్ తెలుగులో మొదటిసారిగా 'అజ్ఞాతవాసి' సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకి ఆయన అందించిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన 'కొడకా కోటేశ్వర్రావా' పాట జనంలోకి దూసుపోయింది.

సినిమాలో ఈ పాటలో అనిరుథ్ కూడా కనిపిస్తాడట. గతంలో అనిరుథ్ స్వరపరిచిన కొన్ని తమిళ సినిమా పాటల్లో అక్కడక్కడా ఆయన మెరిసిన సందర్భాలు వున్నాయి. అలాగే ఆయన 'అజ్ఞాతవాసి' సినిమాలో ఈ పాటలో పవన్ తో పాటు కలిసి కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా ఆడియో రెస్పాన్స్ తో, ఆయనని వరుసగా అవకాశాలు పలకరిస్తున్నాయట.

More Telugu News