triple talak bill: నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్ జారీ!

  • లోక్ సభలో బిల్లుకు ఇప్పటికే ఆమోదం
  • రాజ్యసభలో విపక్షాలదే మెజార్టీ
  •  సవరణలు సూచించనున్న కాంగ్రెస్ 

ముస్లిం సమాజంలో ప్రకంపనలు రేపుతున్న ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభ ముందుకు రాబోతోంది. లోక్ సభలో ఈ బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే, రాజ్యసభలో మాత్రం విపక్షాలకు మెజాటీ ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. విపక్షాలన్నీ ఏకమైతే ఈ బిల్లు వీగిపోయే అవకాశం ఉంది.

మరోవైపు, ఇతర విపక్ష పార్టీలతో సంబంధం లేకుండా బిల్లులో కొన్ని మార్పులను కాంగ్రెస్ పార్టీ సూచించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మూడు రోజుల సెలవుల అనంతరం పార్లమెంటు నేడు సమావేశం కానుంది. ఈ కీలక బిల్లు నేపథ్యంలో, తమ రాజ్యసభ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది.  

More Telugu News