New Year: డిసెంబరు 31 ‘కిక్కే’ వేరప్పా.. ఆ ఒక్క రాత్రే ఏపీ, తెలంగాణలో రూ.430 కోట్లు తాగేశారు!

  • ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారిన మద్యం
  • పోటాపోటీగా తాగిన మందుబాబులు
  • ఏపీలో రూ.230 కోట్లు, తెలంగాణలో రూ.200 కోట్ల మద్యాన్ని ఊదేశారు!

కొత్త సంవత్సర వేడుకల పేరుతో ఏపీ, తెలంగాణలో మందు బాబులు ఏకంగా ఒక్క రాత్రే రూ.430 కోట్ల విలువైన మద్యాన్ని పొట్టలో వేసేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు 31కి ముందు ఆరు రోజుల్లో మొత్తం 240 కోట్ల విక్రయాలు జరగ్గా ఒక్క 31నే రూ.230 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నిజానికి మామూలు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.40 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడవుతుండగా ఏడాది చివరి రోజున మాత్రం మద్యం ఏరులై పారింది.

కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో డిసెంబరు 26-31 మధ్య రూ.102.38 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు చేరుకుంది. ఇందులో రూ.50  కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. జిల్లాల వారీగా చూస్తే విశాఖలో రూ.30 కోట్ల విక్రయాలు జరిగాయి. ఇక మందు విక్రయాల్లో బీరు జోరు కొనసాగింది. 9.02 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.
 
తెలంగాణలోనూ మద్యం ప్రవహించింది. 31న ఒక్క రోజే రూ.200 కోట్ల విలువైన మద్యాన్ని ఖాళీ చేశారు. ఆ రోజున రూ.207.7 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ.125 కోట్లు తాగేశారు. వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రూ.20 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి.

More Telugu News