bahubali: బాహుబ‌లి ఎవ‌రు? రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందా?: డీకే అరుణ కీల‌క వ్యాఖ్య‌లు

  • ఇదేమన్నా సినిమానా?
  • కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌నే రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వ‌చ్చారు
  • రేవంత్ రెడ్డి రాక‌ను నేను వ్య‌తిరేకించాన‌న్న ప్ర‌చారంలో నిజం లేదు

రేవంత్ రెడ్డి వ‌చ్చాకే కాంగ్రెస్ పార్టీలో ఊపు వ‌చ్చిందన‌డానికి తాను వ్య‌తిరేక‌మ‌ని ఎమ్మెల్యే డీకే అరుణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి బాహుబ‌లి వ‌స్తాడ‌ని గ‌తంలో కాంగ్రెస్ నేత‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాక ఆయ‌నే బాహుబ‌లి అని కొంద‌రు అన్నారు. తాజాగా డీకే అరుణ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... త‌మ పార్టీలోకి బాహుబ‌లి రావ‌డం ఏంట‌ని, ఇదేమన్నా సినిమానా? అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌నే రేవంత్ రెడ్డి త‌మ పార్టీలోకి వ‌చ్చార‌ని డీకే అరుణ తెలిపారు. వేరే పార్టీలు ఏవీ బ‌లంగా లేవు కాబ‌ట్టి, తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీయే ప్ర‌త్యామ్నాయం కాబ‌ట్టి రేవంత్ రెడ్డి త‌మ పార్టీలో చేరార‌ని వ్యాఖ్యానించారు. తాను రేవంత్ రెడ్డి రాక‌ను వ్య‌తిరేకించాన‌న్న ప్ర‌చారంలో నిజం లేదని, అస‌త్య‌ ప్ర‌చారం జ‌రిగిందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌న్న విష‌యాన్ని కొంద‌రు ర‌హ‌స్యంగానే ఉంచారని తెలిపారు.   

More Telugu News