airplane: 2018లో బ‌య‌ల్దేరి 2017లో చేరుకున్న విమానం!

  • ఘ‌న‌త సాధించిన హవాయి ఎయిర్‌లైన్స్ విమానం
  • ఆక్లాండ్‌ నుంచి హొనొలులుకి ప్ర‌యాణం
  • ట్వీట్ చేసిన ఫ్లైట్ రాడార్‌24 సంస్థ‌

'టైమ్ ట్రావెల్ సాధ్య‌మే... ఆక్లాండ్ నుంచి 2018లో బ‌య‌ల్దేరిన విమానం, 2017లో హొనొలులుకి చేరుకుంటుంది' అంటూ విమాన‌ గ‌మ‌నాన్ని ప‌ర్య‌వేక్షించే ఫ్లైట్ రాడార్ 24 వెబ్‌సైట్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసింది. వీరి ట్వీట్ వెన‌క లాజిక్ అర్థం చేసుకుంటే... కొన్నిసార్లు నిజ‌మేనేమో అనిపిస్తుంది. ఇంత‌కీ ఇదెలా సాధ్యం అంటారా?

అంత‌ర్జాతీయ టైమ్ జోన్ల ప్ర‌కారం చూసుకుంటే ఇది సాధ్య‌మ‌వుతుంది. హ‌వాయి ఎయిర్‌లైన్స్‌కి చెందిన హెచ్ఏ446 విమానం, ఆక్లాండ్ నుంచి బ‌య‌ల్దేరింది. అది బ‌యల్దేరే స‌మ‌యానికి అక్క‌డ న్యూఇయ‌ర్ వ‌చ్చేసింది. మ‌ళ్లీ హొనొలులుకి చేరుకునే స‌రికి ఇంకా 2017 సంవ‌త్స‌ర‌మే న‌డుస్తోంది. దీంతో టైమ్ జోన్ల లెక్క ప్ర‌కారం ఆ విమానం టైమ్ ట్రావెల్ చేసింద‌న్న‌మాట‌. ఈ ట్వీట్‌ నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.

More Telugu News