vijay devarakonda: ఇంతకన్నా గొప్ప సంవత్సరం ఏముంటుంది?: 'అర్జున్ రెడ్డి' హీరో

  • ఓ వైపు చిరునవ్వుల‌తో నాన్న.. మరోవైపు మెగాస్టార్‌
  • చాలా గొప్ప సంవత్సరం
  • అవార్డు అందుకున్నాను

'పెళ్లిచూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, 'అర్జున్ రెడ్డి' సినిమాతో అద‌ర‌గొట్టిన విజ‌య్ దేవ‌రకొండ.. నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతూ... గ‌త ఏడాది తన‌కు ఎదురైన మ‌ధురానుభూతుల‌ను గుర్తు చేసుకున్నాడు. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ... 'ఓ వైపు చిరు నవ్వుల‌తో నాన్న, మరోవైపు మెగాస్టార్‌.. చాలా గొప్ప సంవత్సరం' అంటూ పేర్కొన్నాడు. ఆ ఫొటోలో చిరంజీవి చేతుల మీదుగా తాను అవార్డు అందుకుంటుండ‌గా మ‌రోవైపు త‌న నాన్న ఉన్నాడ‌ని తెలిపాడు. త‌న త‌ల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తానని పేర్కొన్నాడు. 

More Telugu News