Pakistan: కశ్మీర్ తీవ్ర‌వాది బుర్హాన్ వనీపై యానిమేటెడ్ చిత్రం.. టీజ‌ర్ విడుద‌ల‌

  • కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పాకిస్థాన్‌
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రానా అబ్రార్‌
  • అమ‌ర‌వీరుడిగా చిత్రీక‌రించిన వైనం

భార‌తీయ సైన్యం హ‌త‌మార్చిన కశ్మీర్ తీవ్ర‌వాది బుర్హాన్ వనీని అమ‌ర వీరుడిగా కీర్తిస్తూ నిర్మించిన 'బుర్హాన్: ద స‌న్ ఆఫ్ కశ్మీర్‌' చిత్రం టీజ‌ర్ విడుద‌లైంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. పాకిస్థాన్‌కి చెందిన రానా అబ్రార్ అనే ద‌ర్శకుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ చిత్రంలో బుర్హాన్ వనీని ఓ అమ‌రవీరుడిగా చిత్రీక‌రించారు.

హిజ్బుల్ ముజ‌హిద్దీన్ క‌మాండ‌ర్‌గా పనిచేసిన బుర్హాన్ ను 2016, జులై 8న భార‌త సైన్యం హ‌త‌మార్చింది. ఆ త‌ర్వాత బుర్హాన్‌ని పొగుడుతూ అప్పటి పాకిస్థాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News