ipo: ఐపీవోకు రాబోతున్న మరో ప్రైవేటు బ్యాంకు... సెబీ వద్ద బంధన్ బ్యాంకు పత్రాలు దాఖలు!

  • సెబీ వద్ద పత్రాల దాఖలు
  • 11.92 కోట్ల షేర్లు విక్రయానికి
  • ఈ బ్యాంకు ప్రారంభమై మూడేళ్లే అయింది! 

ప్రైవేటు రంగంలోని బంధన్ బ్యాంకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కు సంబంధించి సెబీ అనుమతి కోరుతూ ఈ రోజు పత్రాలను దాఖలు చేసింది. మైక్రోఫైనాన్స్ సంస్థగా ఉన్న బంధన్ 2015లో బ్యాంకు లైసెన్స్ పొంది ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసింది. 11.92 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా విక్రయించనున్నట్టు బంధన్ బ్యాంకు తెలిపింది.

 ‘‘ఆర్ బీఐ నూతన లైసెన్స్ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మూడేళ్లలోపు లేదా 2018 ఆగస్ట్ 22లోపు కంపెనీ వాటాలను స్టాక్ ఎక్సేంజ్ లలో లిస్ట్ చేయాల్సి ఉంటుంది’’ అని బంధన్ బ్యాంకు ఐపీవో పత్రాల్లో పేర్కొంది. ఐపీవోలో భాగంగా ఐఎఫ్ సీ, ఐఎఫ్ సీ ఎఫ్ఐజీ తమకున్న వాటాల్లో కొద్ది మేర విక్రయించనుండగా, కంపెనీ తాజా ఈక్విటీ జారీ ద్వారా మిగిలిన షేర్లను ఆఫర్ చేస్తోంది.

ipo

More Telugu News