haathi mera saathi: 'హాథీ మేరా సాథీ' అంటున్న భ‌ల్లాల దేవుడు... ఫ‌స్ట్‌లుక్ చూడండి!

  • బందేవ్ పాత్ర‌లో న‌టిస్తున్న రానా
  • హిందీ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం
  • తెలుగు వెర్షన్ కు 'అడవి రాముడు' టైటిల్ 

బాహుబ‌లి చిత్రాల‌తో అంత‌ర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రానా ద‌గ్గుబాటి, త్వ‌రలో 'హాథీ మేరా సాథీ' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ని న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా రానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు. వెన‌కాల ఏనుగుతో దాని దంతాల మ‌ధ్య ఉన్న రానాను ఈ లుక్‌లో చూడొచ్చు. ఇందులో రానా పాత్ర‌పేరు 'బందేవ్'. ఈ చిత్రంలో రానా ఎలాంటి మేక‌ప్ లేకుండా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భు సోలొమాన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ, తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1971లో రాజేశ్ ఖ‌న్నా హీరోగా వ‌చ్చిన చిత్రానికి ఇది రీమేక్‌. అయిన‌ప్ప‌టికీ ఇందులో చాలా కొత్త అంశాలుంటాయ‌ని, నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'అడవి రాముడు' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు సమాచారం. 

More Telugu News