pavan: పవన్ పాట రికార్డు స్థాయిలో ఒక ఊపు ఊపేస్తోంది

  • దూసుకుపోతోన్న పవన్ పాట 
  • 2.28 మిలియన్ల వ్యూస్ 
  • 2.27 లక్షల లైక్స్    

'అజ్ఞాతవాసి' సినిమా కోసం పవన్ పాడిన 'కొడకా కోటేశ్వర రావు' అనే పాటను, న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేశారు. ఈ పాట కోసమే పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. దాంతో యూట్యూబ్ లో వదిలిన కొంతసేపటికే ఈ పాట ఒక రేంజ్ లో దూసుకుపోయింది.

మాస్ ఆడియన్స్ పాలిట మంత్రంలా పనిచేసిన ఈ పాట, అన్నివర్గాల ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్ ను.. 2.27 లక్షల లైక్స్ ను రాబట్టింది. ఈ సినిమా పట్ల ఏ స్థాయిలో అంతా కుతూహలంగా ఉన్నారనేదానికి ఈ హిట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసి .. జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.   

More Telugu News