Hyderabad: హైదరాబాద్ పార్క్‌ హోటల్‌లో కలకలం.. బౌన్సర్‌కు నిప్పంటించి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు!

  • యువకుడు 26 ఏళ్ల సందీప్‌గా గుర్తింపు
  • బౌన్స‌ర్ దుర్భాష‌లాడడంతో సందీప్ ఆగ్ర‌హం
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన వైనం
  • ఆసుప‌త్రిలో ఇరువురికి చికిత్స  

హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో అలజడి చెలరేగింది. 26 ఏళ్ల సందీప్ అనే యువకుడికి, సదరు హోటల్ బౌన్సర్‌కి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ యువకుడిని బౌన్సర్ దుర్భాషలాడుతూ అవమానించడంతో సందీప్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బౌన్సర్‌పై పెట్రోల్ చల్లడంతో పాటు తనపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించాడు. ఈ విషయాన్ని గుర్తించిన హోటల్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పింది. మంటలను అదుపు చేసి వారిరువురినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

More Telugu News