Ramcharan: 'వైట్ న్యూఇయర్'.. ఫుల్ జోష్ లో రామ్ చరణ్, ఉపాసన, సానియా మీర్జా.. వీడియో చూడండి

  • సానియాతో కలసి చరణ్ దంపతుల ఎంజాయ్ మెంట్
  • వీడియో అప్ లోడ్ చేసిన ఉపాసన, సానియా
  • వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్ అంటూ హ్యాష్ ట్యాగ్స్

ఇండియన్ టెన్నిస్ ప్లేయర్  సానియా మీర్జాతో కలసి హీరో రామ్ చరణ్ దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరు ముగ్గురూ కలసి మంచులా తెల్లగా ఉన్న ఓ పదార్థాన్ని సరదాగా గాల్లోకి విసురుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

సానియా, ఉపాసనలు ఆ పదార్థాన్ని గాల్లోకి విసురుతుండగా... చెర్రీ దాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోను ఉపాసన, సానియా మీర్జాలు తమ ట్విట్లర్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోకు వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్, రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపాసన జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News