padmavathi: సెన్సార్ క్లియరెన్స్ కావాలంటే.. ఇవన్నీ పాటించండి: 'పద్మావతి' నిర్మాత, దర్శకులకు సెన్సార్ బోర్డు షరతులు

  • 'పద్మావత్' గా పేరు మార్పు
  • సతిని గొప్పగా చూపించరాదు
  • 26 సన్నివేశాలకు కత్తెర

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. 'పద్మావతి' అనే పేరును 'పద్మావత్' గా మార్చాలని తెలిపింది. మొత్తం సినిమాలో 26 సన్నివేశాలను కట్ చేస్తామని చెప్పింది.

ఘూమర్ ను, సతిని గొప్ప విషయంగా చూపించరాదని స్పష్టం చేసింది. భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రతో ఈ సినిమా కథకు సంబంధం లేదని ప్రకటించాలని సూచించింది. సినిమా సన్నివేశాల మధ్యలో మూడు సార్లు ఈ ప్రకటనలు జోడించాలని చెప్పింది ఈ షరతులకు దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సూచనలను అమలు చేస్తే 'పద్మావతికి' యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉంది.

More Telugu News