air india: ప్రైవేటు చేతుల్లోనే ఎయిర్ ఇండియాకు గత వైభవం: జయంత్ సిన్హా

  • లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ కూడా ఒకప్పుడు ప్రైవేటీకరించినవే
  • ప్రైవేటు రంగం ఈ వ్యాపారాన్ని మెరుగ్గా నిర్వహించగలదు
  • ఎయిర్ ఇండియా కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది

ప్రభుత్వరంగంలోని ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమర్థించుకున్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు రంగం ఎయిర్ లైన్స్ వ్యాపారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించగలదన్నారు. ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయం వచ్చే ఐదు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రూ.51,000 కోట్లకు పైగా రుణ భారంతో ఉన్న ఎయిర్ ఇండియాను వదిలించుకోవాలనే నిర్ణయంతో కేంద్రం ఉన్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా సిన్హా మాట్లాడుతూ... ‘‘ప్రపంచవ్యాప్తంగా లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ వేస్, ఖంటాస్ అన్నీ అక్కడి ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేసినవే. ఇప్పుడవి ప్రైవేటు రంగ కంపెనీలు. ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థలు మెరుగ్గా ఈ వ్యాపారాన్ని నిర్వహించగలవు. అందుకే మేము సైతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకున్నాం’’ అని సిన్హా వివరించారు. మంచి బిడ్డింగ్ తో కొనుగోలుదారులు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఒక్కసారి ఎయిర్ఇండియా ప్రైవేటు పరం అయితే అది తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News