rajan tejeshwar: తమిళ లవ్ స్టోరీలో విలన్ గా ఛమ్మక్ చంద్ర .. ట్రైలర్ రిలీజ్

  • 'జబర్దస్త్' తో చమ్మక్ చంద్ర పాప్యులర్ 
  • తెలుగు సినిమాల్లో చిన్న పాత్రలు 
  • విలన్ గా తమిళంలోకి ఎంట్రీ  

'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా ఛమ్మక్ చంద్రకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కార్యక్రమం కారణంగా ఆయనకి వరుసగా తెలుగు సినిమాల్లోను అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఓ తమిళ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. 'సేయల్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రవి అబ్బులి దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, రాజన్ తేజశ్వర్ .. తరుషి నాయకా నాయికలుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బుల్లితెరపై .. తెలుగు తెరపై కామెడీని పండించే ఛమ్మక్ చంద్ర, ఈ సినిమాలో సీరియస్ విలన్ గా తన పాత్రను బాగానే పండించాడనే విషయం అర్థమవుతోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మలచబడిన ప్రేమ కథాంశంగా ఈ సినిమా రూపొందుతోందనే విషయం, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత, ఛమ్మక్ చంద్రకి అక్కడ మరిన్ని సినిమాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

More Telugu News