unicef: ఒక భారతీయ వనితగా గర్విస్తున్నా!: నటి త్రిష

  • యునిసెఫ్ హోదా లో స్వచ్ఛ భారత్ ప్రచారం
  • ఈ హోదా దక్కిన తొలి దక్షిణ నటి త్రిష
  • అభిమానుల్లో ఆనందం

గత కొంత కాలంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, చిన్నారులపై వేధింపులు తదితర అంశాల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న హీరోయిన్ త్రిష యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హోదాకు ఎంపికైన సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశం నుంచి యునిసెఫ్ రాయబార హోదా పొందిన తొలి నటి త్రిషే కావడం విశేషం. ఇంతకుముందు అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, సచిన్ టెండూల్కర్‌కు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది.

తాజాగా త్రిష స్వచ్ఛ భారత్ కి స్ఫూర్తి నింపేలా తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ చోట మరుగుదొడ్డి నిర్మాణంలో స్వయంగా పాల్గొంది. ముఖ్యంగా మహిళలు ఎవరూ బహిర్భూమికి వెళ్లకూడదని పిలుపునిచ్చింది. క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న త్రిష ఇలాంటి గొప్ప పనులు చేయడంతో అభిమానులందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

More Telugu News