srinivas reddy: శ్రీనివాస్ రెడ్డికి లక్కీ ఛాన్స్ .. తెరపైకి మరోసారి 'జంబలకిడి పంబ'

  • హీరోగా శ్రీనివాస్ రెడ్డికి మరో ఛాన్స్ 
  • ఈ రోజునే మొదలైన షూటింగ్ 
  • హైలైట్ గా నిలవనున్న పోసాని పాత్ర

శ్రీనివాస్ రెడ్డి మంచి కమెడియన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. 'గీతాంజలి' .. ' జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలు కథానాయకుడిగా ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా ఆయన మరో హాస్యభరితమైన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆ సినిమా పేరే 'జంబలకిడి పంబ'.

మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజునే మొదలైంది. ఈ సినిమా షూటింగ్ మార్చి 10వ తేదీ వరకూ కంటిన్యూగా జరుగుతుందని నిర్మాతలు చెప్పారు. హైదరాబాద్ .. గోదావరి జిల్లాలు .. కేరళలో షెడ్యూల్స్ ను ప్లాన్ చేశామని అన్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి పోషిస్తోన్న పాత్ర  ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని చెప్పారు. పోసాని కృష్ణమురళి .. వెన్నెల కిషోర్ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అన్నారు. కథా కథనాలపరంగా గతంలో వచ్చిన 'జంబలకిడి పంబ'తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆ మూవీ మాదిరిగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

More Telugu News