vishwanathan anand: ప్ర‌పంచ ర్యాపిడ్ చెస్‌ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌... విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌

  • 14 ఏళ్ల త‌ర్వాత తిరిగి కైవ‌సం
  • ఫైన‌ల్‌లో వ్లాదిమిర్ ఫెదోసీవ్‌పై గెలుపు
  • మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించిన ఆనంద్‌

ఈ ఏడాది విజ‌యాలు లేకుండా చెస్ ఛాంపియ‌న్ విశ్వనాథ‌న్ ఆనంద్ ముగిస్తాడ‌ని అందరూ అనుకున్నారు. కానీ వారి ఊహాగానాల‌ను కాల‌రాస్తూ ప్ర‌పంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచి ఆనంద్ త‌న స‌త్తా చాటుకున్నాడు. దాదాపు 14 ఏళ్ల త‌ర్వాత ఆయ‌న ఈ టైటిల్‌ని తిరిగి కైవ‌సం చేసుకున్నాడు. 2003లో ఆయ‌న ర్యాపిడ్ చెస్ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా నిలిచాడు. మ‌ళ్లీ ఇప్పుడు రియాద్‌లో జ‌రుగుతున్న ఈ ఛాంపియ‌న్‌షిప్‌లో ప్ర‌పంచ నెం.1 మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ని ఆనంద్ ఓడించి, ఆ త‌ర్వాత ర‌ష్యా క్రీడాకారుడు వ్లాదిమిర్ ఫెదోసీవ్‌తో జ‌రిగిన ఫైన‌ల్‌లో గెలిచి, టైటిల్ సాధించాడు.

తాను విజ‌యం సాధించిన త‌ర్వాత త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ ఆనంద్ ట్వీట్ చేశాడు. `అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.. నాకు గాల్లో తేలుతున్న‌ట్లుగా అనిపిస్తోంది. మ‌న‌మే విజేత‌లం అనే పాట నా త‌ల‌లో మెదులుతూనే ఉంది` అని ఆయ‌న ట్వీటాడు. ఆనంద్ విజ‌యాన్ని ప్ర‌శంసిస్తూ రాష్ట్ర‌ప‌తి, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీలు కూడా ట్వీట్ చేశారు. ఇంత‌కాలం ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ధైర్యం కోల్పోకుండా ఆడి విజ‌యం సాధించినందుకు నెటిజ‌న్లు, అభిమానులు ఆనంద్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

More Telugu News