Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. కొండపై లక్షలాది మంది భక్తులు!

  • ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల కిటకిట
  • పోటెత్తిన భక్తజనం
  • వెంకన్నను దర్శించుకున్న వందలాది వీఐపీలు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల భక్తులు పోటెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ, మంత్రులు చినరాజప్ప, పితాని సత్యనారాయణలు కూడా శ్రేవేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు 20 మంది కేంద్ర మంత్రులు, 150 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 50 మంది న్యాయమూర్తులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, వందల సంఖ్యలో ప్రొటోకాల్ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైగా భక్తులు తిరుమల కొండపై ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.

More Telugu News