paripoornananda: బయట పాకిస్థాన్... ఇంట అసదుద్దీన్ ఒవైసీ.. ఇది ఎంత వరకు సబబు?: స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం

  • ట్రిపుల్ త‌లాక్ ముస్లిం మ‌హిళల జీవితాల‌ను నాశ‌నం చేస్తోంది
  • ఓ వైపు సుప్రీంకోర్టు కూడా ర‌ద్దు చేసింది
  • మ‌రోవైపు అసదుద్దీన్ ఒవైసీ అడ్డుప‌డాల‌ని చూస్తున్నారు
  • పాక్ మొన్న యావత్ స్త్రీ జాతినే అవమానించింది.. ఇప్పుడు అస‌దుద్దీన్‌!

కుల్‌భూషణ్ జాదవ్ తల్లి, భార్య పట్ల క్రూర ప్రవర్తనతో మొన్న మొత్తం యావత్ స్త్రీ జాతినే పాకిస్థాన్ అవమానించిందని రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. అది అలా ఉంటే ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశపు స్త్రీలకు జరుగుతున్న న్యాయం చూసి తట్టుకోలేక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లాంటి వారు కోర్టు తీర్పులపై ఓటుబ్యాంకు రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

భారతీయ ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ వల్ల ఎంతో బాధను అనుభవిస్తున్నారని పరిపూర్ణానంద తెలిపారు. అటువంటి విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని, ఎవరైనా ట్రిపుల్ తలాక్ కు పాల్పడితే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేలా పార్లమెంటులో బిల్లు పెడితే అసదుద్దీన్ ఒవైసీ వంటి వారు వింతగా విమర్శించడం ఎంత వరకు సబబని పరిపూర్ణానంద నిలదీశారు. బయట పాకిస్థాన్.. ఇంట అసదుద్దీన్ ఒవైసీ.. స్త్రీ జాతిని ఇంత తక్కువ చేసేలా వ్యవహరిస్తున్నారని ఫేస్‌బుక్ ద్వారా ఆరోపించారు. 

More Telugu News